సినిమా

THE 100 Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేసిన ఆర్కే సాగర్, ‘ది 100’ ఇంటెన్స్ & గ్రిప్పింగ్ ట్రైలర్‌

THE 100 Trailer: ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

“జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం” అనే విక్రాంత్ ఐపీఎస్ వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆయుధాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదనే రూల్ పెట్టుకుంటాడు. కానీ ఆత్మరక్షణ కోసం, అతను తాను ఆయుధంగా చూసుకోవడం ప్రారంభిస్తాడు. వ్యవస్థలోని శక్తివంతమైన వ్యక్తుల మద్దతుతో క్రూరమైన దొంగల ముఠా అతని జీవితంలో ఒక పెద్ద సవాలు ఎదురౌతుంది. అతని సొంత డిపార్ట్మెంటర్ కూడా అతనిపై ఆరోపణలు చేసి, చివరికి అతన్ని సస్పెండ్ చేస్తుంది. ఒకప్పుడు ఆయుధం తీసుకెళ్లనని శపథం చేసిన వ్యక్తి ఆయుధం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లోకి వస్తాడు.

పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయిన ఆర్‌కె సాగర్ విక్రాంత్ ఐపీఎస్‌గా ఫిట్‌గా, అద్భుతంగా కనిపించారు. తన పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మిషా నారంగ్ తన లవ్ ఇంట్రస్ట్ గా కనిపించి కథకు రొమాంటిక్ టచ్‌ను యాడ్ చేసింది.

దర్శకుడు రాఘవ్ ఓంకార్ ది 100 చిత్రాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు సస్పెన్స్, థ్రిల్స్ నిండిన ఇంటెన్స్, గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది, హర్షవర్ధన్ రామేశ్వర్ పవర్ ఫుల్ సంగీతం యాక్షన్ ని మరింత ఎలివేట్ చేసింది. ఈ చిత్ర ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల, చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌. సుధీర్ వర్మ పెరిచర్ల డైలాగ్స్. ట్రైలర్ థియేటర్ విడుదలకు ముందే సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

తారాగణం: RK సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, VV గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప, వంశీ నెక్కంటి, టెంపర్ వంశీ.

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు
బ్యానర్లు: KRIA ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్
DOP: శ్యామ్ కె నాయుడు
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ప్రొడక్షన్ డిజైన్: చిన్నా
డైలాగ్స్: సుధీర్ వర్మ పేరిచర్ల
స్టంట్స్: విజయ్ మాస్టర్
లిరిక్స్: రాంబాబు గోశాల, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి,శ్రీ హర్ష ఈమని
పీఆర్వో: వంశీ-శేఖర్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button