ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: దేశ అంతర్గత భద్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: దేశ అంతర్గత భద్రతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సరిహద్దులో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారు. దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం చాలా కీలకమని పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని పవన్ తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని అన్నారు. గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందన్నారు. హైదరాబాద్, కోయంబత్తూరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తలచుకుంటే ఇప్పటికి గుండె తరుక్కుపోతుందని అన్నారు. వలసదారుల విషయంలో తగిన నిఘాను ఉంచితే జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button