Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్న హరిహర వీరమల్లు మూడో సాంగ్

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మూడో సాంగ్ రిలీజైంది. కీరవాణి ట్యూన్, రాంబాబు గోసల లిరిక్స్‌తో ఈ పాట ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్నిస్తోంది. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్ విడుదలైంది. యోధుడు వీరమల్లు జీవిత కథ ఆధారంగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ రూపొందించిన ఈ సినిమా జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది. ఏ ఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
కీరవాణి సమకూర్చిన ట్యూన్, రాంబాబు గోసల సాహిత్యంతో ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. ప్లే బ్యాక్ సింగర్స్ ఉత్సాహభరితంగా ఆలపించిన ఈ పాటలో పవన్ పవర్ఫుల్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. రెండు సాధారణ పాటల తర్వాత ఈ శక్తివంతమైన సాంగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.