టాలీవుడ్
Pawan Kalyan-Dil Raju: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన నిర్మాత దిల్ రాజు

Pawan Kalyan-Dil Raju: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు. ఇరువురు 45నిమిషాలకుపైగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సమావేశంలో అల్లు అర్జున్ ఎపిసోడ్, ఇటీవల రేవంత్ తో జరిగిన భేటీ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
మరి నిజంగానే టాలీవుడ్‌ని ఏపీ పిలుస్తోందా? పవన్ భేటీతో రేవంత్ సర్కార్‌కు దిల్‌రాజు ఇచ్చే సందేశమేంటి? సంధ్య థియేటర్ ఘటనతోనే గేమ్ ఛేంజర్ ఈవెంట్ మారిందని భావించవచ్చా? అనే అనుమానాలు కల్గుతున్నాయి.