ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: సినిమాలో చెప్పే డైలాగ్‌లు సినిమా హాలు వరకే బాగుంటాయి

Pawan Kalyan: వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో.. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంపై స్పందించిన వైఎస్ జగన్.. అది సినిమా డైలాగ్ అని సమర్ధించారు. పుష్ప సినిమాలోని గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా అనేది డైలాగ్ అని మీడియాతో వెల్లడించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలను కూటమి మంత్రులు తీవ్రంగా ఖండించారు.

వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయన్నారు పవన్ కల్యాణ్. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ తేల్చి చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button