ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …

Pawan Kalyan: ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడుల వ్యవహారం పై పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగులు సిబ్బంది తో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. రాష్ట్ర, జిల్లా మండల స్థాయిలో వివిధ స్థాయిలో అధికారులు, ఉద్యోగుల తో మాట్లాడనున్న డిప్యూటీ సీఎం.
ఇటీవల కడప జిల్లా లో ఎంపిడిఓ పై జరిగిన దాడి నేపథ్యంలో ఉద్యోగులతో మాట్లాడీ భరోసా కల్పించనున్న డిప్యూటీ సీఎం. రాష్ట్ర స్థాయిలో పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ ల నుంచి గ్రామీణ ఉపాధి హామీ పధకం సుపర్ వైజర్ ల వరకూ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.