ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: పార్లమెంట్ సమావేశాలు.. పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతిలో లోక్‌సభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో గట్టిగా గళం విప్పాలని సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు ముందస్తుగా సిద్ధం కావాలని ఎంపీలకు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు సంబంధిత కేంద్ర మంత్రులతో సమావేశమై, వివరణాత్మక నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button