తెలంగాణ
సికింద్రాబాద్‌కు పాస్టర్ ప్రవీణ్ మృతదేహం

అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతదేహాన్ని సికింద్రాబాద్‌కు తరలించారు. సందర్శనార్ధం సెంటినరీ బాపిస్ట్ చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ఓవైపు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండగా మరోవైపు పగడాల ప్రవీణ్ భౌతికకాయానికి క్రైస్తవులు నివాళులు అర్పిస్తున్నారు.
అటు కడసారి చూసేందుకు క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా సెంటినరీ బాపిస్ట్ చర్చ్ వద్ద పోలీసులు మోహరించారు. అటు పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రైస్తవుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.