Pashamailaram: పాశమైలారం ఘటనలో దర్యాప్తు ముమ్మరం

Pashamailaram: పాశమైలారం ఘటనలో దర్యాప్తు ముమ్మరంపాశమైలారం ఘటనలో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ప్రమాదస్థలికి సీఎస్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ టీమ్ చేరుకుంది. తాజాగా ప్రమాద స్థలాన్ని రెవెన్యూ, పరిశ్రమలు కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ కార్యదర్శులు పరిశీలించారు. కాగా ఇప్పిటికే నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ, నెలరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
మరోవైపు సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మహారాష్ట్రకు చెందిన భీమ్‌రావు చికిత్స పొందు తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఘటనా స్థలంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కొంతమంది ఆచూకీ ల భ్యం కాకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమవారి ఆచూకీ చెప్పాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.