ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ వన్ టౌన్‌లో పార్కింగ్ మాఫియా అక్రమాలు

విజయవాడ వన్ టౌన్ లో పార్కింగ్ మాఫియా అక్రమాలు మితిమీరిపోతున్నాయి. అరికట్టాల్సిన అధికార యంత్రాంగం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తోంది. కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ దిగువ దర్గా రోడ్డు బ్లాక్ చేసి టోల్ గేట్ పేరుతో దందా చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వాహనదారులపై పార్కింగ్ మాఫియా సిబ్బంది లక్ష్మీ నరసింహ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్డును కూడా పార్కింగ్ కోసం పాడుకున్నామని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని సిబ్బంది వాగ్వాదానికి దిగారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఇప్పుడు ఏకంగా దుర్గగుడి దారిలో పార్కింగ్ మాఫియా దందాలు చేయడంపై వాహనదారులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడి అధికారులు, పోలీసులు పార్కింగ్ మాఫియా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



