ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: నేడు ఏపీ డిప్యూటీ సీఎంతో దిల్‌రాజు భేటీ..

Pawan Kalyan: టాలీవుడ్.. ఏపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ పిలుస్తోందంటూ సంకేతాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఏపిసోడ్ క్రమంలో చిత్ర పరిశ్రమ ఏపీకి వస్తే తమ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలు కాస్త సద్దు మణిగించినా.. ఇప్పుడు మళ్లీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. అంతేకాదు.. పవన్‌ను కలుస్తున్నట్లు దిల్‌రాజు ప్రకటించారు. ఏపీలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్‌ను బట్టి ఏపీలోనే ఈవెంట్ నిర్వహిస్తామన్నారు.