ఆంధ్ర ప్రదేశ్
పోలీస్ స్టేషన్‌లో పందెం కోళ్లు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుందూరు గ్రామంలో పోలీసులు కోడిపందాల స్థావరంపై దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. 23 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 10 మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు ఈ దాడి తీర ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.



