తెలంగాణ
పంచాయతీ ఎన్నికలు.. ఉరుమడ్లలో ఉద్రిక్తత

Panchayat Elections: స్థానికల ఎన్నికల వేళ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఉరుమడ్ల గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. అదనపు బలగాలను మోహరించారు.



