ఆంధ్ర ప్రదేశ్
Vemulawada: గెలుపు కోసం… అభ్యర్థుల వినూత్న ప్రచారాలు

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఆడబిడ్డ పుడితే ఆ పాప పేరిట 10 వేల 16 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు తెలిపారు.
అలాగే మిడ్ మానేరులో నష్టపోయిన బాధితులకు 107 ఇండ్ల ప్యాకేజీ ఇప్పిస్తానని, గ్రామంలో సిసి రోడ్లు, ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరికొందరు గ్రామాల్లో దేవాలయాలకు, కుల సంఘాలకు స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఒకరికి మించి మరొకరు ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.



