జాతియం

India- Pakistan: పాకిస్తాన్‌ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్

India- Pakistan: చెడపకురా చెడేవు అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది ఆ దేశం. మాది అణ్వస్త్ర దేశం ఇండియానైనా ఈజీగా ఓడిస్తాం ప్రపంచంలో మా దేశాన్ని టాప్‌లో నిలబెడతామని గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది. కానీ రియాలిటీ మాత్రం అందుకు భిన్నం. విద్వేషం, ఉగ్రవాదం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ మన దేశ వినాశనమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికీ భారత్ విషయంలో పాక్ తన విషాన్ని చిమ్ముతూనే ఉంది. దీంతో పాకిస్తాన్‌ చేస్తున్న పనులకు భారత్ తగిన బుద్ది చెబుతుంది. మళ్లీ పాక్ కోలుకోలేని విధంగా రంగం సిద్ధం చేస్తుంది. భారత దేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి చూపించబోతుంది. ఇంతకీ భారత్ ఏం చేయబోతుంది..? యుద్ధాల దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే కొలుకుతుంటున్న పాక్‌కు మళ్లీ ఎలాంటి దెబ్బ తగలబోతుంది..?

ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవిస్తారని కర్మ సిద్ధాంతం చెబుతోంది. అయితే ఆ సిద్దాంతాన్ని నమ్మేవారు నమ్ముతారు. నమ్మనివారు నమ్మరు. కానీ దాని రిజల్ట్ మాత్రం పాలో చేస్తుందంటారు అనుభవజ్ఞులు. పాపాత్ములకు పాప కర్మ ఫలితం పుణ్యాత్ములకు పుణ్య కర్మ ఫలితం ఉంటుందనేది అందరూ చెప్పుకునేదే. ఇప్పుడు పాకిస్తాన్ ను కూడా అలాంటి కర్మ ఫలితమే వెంటాడుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయం. అక్కడ అనేకమంది ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. అక్కడే అనేక మంది ఉగ్రవాదుల్ని తయారు చేస్తారు. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. మతం పేరు చెప్పి మారణహోమం సృష్టిస్తారు. అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకోవాలో నేర్పిస్తారు. ఈ క్రమంలోనే కశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకమైన 26మంది టూరిస్టుల ప్రాణాలను ఉగ్రవాదుల రూపంలో బలితీసుకుంది.

దీంతో ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రసంస్థలపై భారత్ విరుచుకుపడింది. తినడానికి తిండి లేదు. ఆహారం దిగుమతి చేసుకోవాలంటే డబ్బు లేదు. రుణాల కోసం గడప గడప వెళ్లి అడుక్కోవాల్సిందే. అలాంటి పరిస్థితులకు పాక్‌ను తీసుకొచ్చింది భారత్. అయినా పాక్ బుద్ధి మారలేదు మళ్లీ భారత్‌తో కయ్యానికి సై అంటోంది. అదే సమయంలో ఆ దేశంలోని పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రాల జలజగడం మొదలయ్యింది.

దీంతో పాక్‌కు భారత్‌ గట్టి షాక్‌ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతుంది. దాంతో పాకిస్తాన్‌కు భారత్ అడ్డుకట్ట వేయనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. ఆ తర్వాత భారత్ జమ్ముకశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతుంది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది.

ఇదివరకే తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. చీనాబ్ నదిపై సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980 సంవత్సరం నుంచే ఉన్నది. పాక్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందం అమలును ఇటీవల నిలిపివేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు కేంద్రం ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

1,856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 22వేల కోట్లు అవుతుందని అంచనా. దాదాపు రెండు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ బిడ్డింగ్‌కు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుటుంది. చివరగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది.

మరోవైపు పహల్గాం దాడి తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్‌లు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌ల ద్వారా 100 రోజుల్లో 12 మంది మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌లను అంతం చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. హతమైన 12 మందిలో ఆరుగురు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు కాగా.. మిగతా వారు జమ్ము కశ్మీర్‌లో జరిగిన ప్రధాన ఉగ్రదాడుల్లో పాల్గొన్న స్థానికులు.

మే 6-7 మధ్య చేపట్టిన ఈ ఆపరేషన్‌ సందర్భంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులను త్రివిధ దళాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత పలు ఆపరేషన్‌ల ద్వారా ఉగ్రవాద ఏరివేతను కొనసాగించాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఆపరేషన్‌ మహాదేవ్ ‌. ఈ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి

ఇక.. జులై 28న శ్రీనగర్‌లోని దచిగామ్‌ ప్రాంతం సమీపంలో సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు సులేమాన్‌, ఆఫ్ఘన్‌, జిబ్రాన్‌ హతమయ్యారు. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాతి రోజే శివశక్తి పేరుతో మరో ఆపరేషన్‌ ను భద్రతా దళాలు మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్‌లో సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

పహల్గాం దాడి తర్వాత దక్షిణ కశ్మీర్‌, షోపియన్‌, పుల్వామాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగించాయి. షోపియన్‌లోని కెల్లర్‌ ఫారెస్ట్‌లో జరిగిన ఆపరేషన్‌లోముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. మే 15న ట్రాల్‌లోని నాదర్‌ ప్రాంతంలో జరిగిన మరో ఆపరేషన్‌లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి.

పహల్గాం దాడికి ముందు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దాదాపు 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు చురుకుగ్గా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు గుర్తించాయి. వాటిల్లో 110-130 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపింది. కశ్మీర్‌లో దాదాపు 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉండగా.. జమ్ము, రాజౌరి, పూంచ్‌లో 60-65 మంది ఉగ్రవాదులు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

ఇలా ఒక్కొక్కటిగా పాకిస్తాన్‌ను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. భారత్ గట్టిగా పిడికిలి బిగిస్తే ఊపిరాడక చనిపోతారన్న భావాన్ని పాక్‌కు అర్థం అయ్యేలా చేస్తుంది. ఒక్కటి కాదు రెండు కాదు అడుగడుగునా దాయాది దేశానికి ఆంక్షలు విధిస్తూ చుక్కులు చూపిస్తుంది. మరి చూడాలి ఇప్పటికైనా పాపిస్తాన్ తన బుద్ధి మార్చుకుంటుందా..? లేక మళ్లీ గిల్లి, గిచ్చి, తన్నించుకుందా.. ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button