అంతర్జాతీయం

Pakistan Spying: చైనీస్ టెక్నాల‌జీతో పౌరుల‌పై నిఘా పెట్టిన పాకిస్థాన్: ఆమ్నెస్టీ రిపోర్ట్‌

Pakistan Spying: ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా… నలుపు నలుపే కానీ తెలుపు కాదు.. అన్న సామెత ఆ రెండు దేశాలకు అచ్చంగా సరిపోతుంది. అసమాన అభివృద్ధితో ప్రపంచ దేశాలకు దీటుగా ఎదుగుతున్న భారత్‌‌కు పొరుగు దేశాల నుంచే ప్రమాదం పొంచి ఉంది. ప్రధాని మోదీని డైరెక్ట్‌గా ఎదుర్కొలేక… ఇండియాను ఏం చేయలేక అక్కసుతో.. కుయుక్తులు పన్నుతున్నారు. దేశ ప్రజలపై నిఘా పెడుతున్నారు. ఇంతకీ చైనా, పాకిస్తాన్ చేస్తున్న ప్లాన్ ఏంటి…? పాకిస్తాన్‌కు చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది..? పౌరులపై నిఘా పెట్టి పాక్ ఏం చేయాలనుకుంటుంది..?

కోట్లాది మంది దేశ ప్ర‌జ‌ల‌పై పాకిస్తాన్ నిఘాపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ సిస్ట‌మ్ ద్వారా ఆ స్పైయింగ్ జ‌రుగుతోంది. చైనా నిర్మించిన ఇంట‌ర్నెట్ ఫైర్‌వాల్ ద్వారా పాకిస్తాన్‌లో సోష‌ల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేసింది.

చైనీస్, పాశ్చాత్య టెక్నాల‌జీ ద్వారా నిర్మించిన మానిట‌రింగ్ నెట్వ‌ర్క్‌తో ప్ర‌జ‌ల‌పై నిఘా పెడుతున్న‌ట్లు ఆమ్నెస్టీ తెలిపింది. పాకిస్థాన్‌లో పొలిటిక‌ల్‌, మీడియా స్వేచ్ఛ‌పై ఇప్ప‌టికే ఆంక్ష‌లు ఉన్నాయి. లాఫుల్ ఇంట‌ర్‌సెప్ట్ మేనేజ్మెంట్ సిస్ట‌మ్ ద్వారా సుమారు 40 ల‌క్ష‌ల మొబైల్ ఫోన్ల‌ను ట్యాపింగ్ చేసే సామ‌ర్థ్యం పాకిస్థాన్ నిఘా ఏజెన్సీల‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది. డ‌బ్ల్యూఎంఎస్ 2.0 ఫైర్‌వాల్ ద్వార సుమారు 20 ల‌క్ష‌ల యాక్టివ్ యూజ‌ర్ల‌ను ఒకేసారి స్తంభింప‌చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆమ్నెస్టీ తెలిపింది.

రెండు ర‌కాల మానిట‌రింగ్ వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయ‌ని, కాల్ ట్యాపింగ్‌ టెక్ట్స్‌ల‌ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలుసుకోవ‌చ్చు అని, దేశ‌వ్యాప్తంగా వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియాను బ్లాక్ చేసే విధంగా టెక్నాల‌జీ కూడా ఉంద‌ని ఆమ్నెస్టీ చెప్పింది. ఎల్ఐఎంఎస్ సాఫ్ట్‌వేర్‌కు కనెక్ట్ కావాల‌ని దేశంలోని నాలుగు మొబైల్ ఆప‌రేట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని ఆమ్నెస్టీ టెక్నాల‌జీ నిపుణుడు జూరీ వాన్ బెర్జ్ తెలిపారు.

అయితే ఇప్పుడు ఇదే టెక్నాలజీ సాంపుల్ మాత్రమే అంటోంది పాకిస్తాన్ ప్రభుత్వం. స్పైయింగ్ సిస్టమ్ ద్వారా అదే టెక్నాలజీని భారత్‌పై కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌పై పీకలదాకా కోపంగా ఉన్న పాక్ చైనా సహాయంతో భారత్ పౌరులపై కూడా స్పైయింగ్ చేసే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్‌తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు చేసింది. దీంతో చైనా, పాక్ ఇరు దేశాల మద్య ఈ సమావేశం జరిగింది.

పాకిస్తాన్ కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సాయాన్ని అందిస్తోంది. రియల్ టైమ్ కో-ఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి.

ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్‌లు, క్షిపణి వ్యవస్థలను‌ భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్‌ని మోహరించింది. దీంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది.

అయితే ఇటీవలె ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. భారత్‌, చైనా, రష్యా దోస్తితో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే చైనాతో భారత్‌ స్నేహం అమెరికాకు కాదు. మన శత్రు దేశం పాకిస్థాన్‌కు కూడా ఊహించని షాకిచ్చిది. పాకిస్తాన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్, మెయిన్ లైన్-1 రైల్వే అప్‌గ్రేడ్ నుండి చైనా వైదొలిగింది .

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల బీజింగ్ పర్యటన తర్వాత చైనా ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆయన CPEC ఫేజ్-2 కింద కొత్త నిధులు లేదా ప్రధాన ప్రాజెక్టులను పొందడంలో విఫలమయ్యారు. బదులుగా ఆయన 8.5 బిలియన్ డాలర్ల విలువైన అవగాహన ఒప్పందాలతో తిరిగి వచ్చారు. ప్రధానంగా వ్యవసాయం, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, ఆరోగ్యం, ఉక్కులో ప్రధాన పెట్టుబడులు లేవు.

అదే సమయంలో వాషింగ్టన్‌తో ఇస్లామాబాద్ సంబంధాలు వేడెక్కడం, టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం తర్వాత చైనా, రష్యాతో భారత్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం, బీజింగ్ విడిపోవడానికి సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ నేపథ్యాన్ని జోడించాయి.

మరి ఇప్పుడు చైనా అసలు ఎవ్వరికి సపోర్ట్ చేస్తుంది అనుకోవాలి పాకిస్తాన్‌కా లేక భారత్‌కా..? లేక తన అవసరాల కోసం అందరిని వాడుకుంటుందని అనుకోవాలా..? మరి చూడాలి చైనా ఇప్పుడు ఎవరికి పుల్ సపోర్ట్ చేస్తుందో..? డ్రగన్ సపోర్ట్ తో పాక్ ఏం చేస్తుందో.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button