Khawaja Asif: భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధాన్ని తోసిపుచ్చలేం

Khawaja Asif: పాకిస్తాన్ అంటేనే పచ్చి మోసం, దగా, చీటింగ్ అన్నది మనందరికీ తెలిసిందే. చీటింగ్ ఆలంబనగా బతుకు సాగిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాతో యుద్ధం చేస్తానంటూ కళ్లబొల్లి కబుర్లు పలుకుతోంది. ఇండియా విషయంలో ఒళ్లంతా వాతల పడిన తర్వాత కూడా పాకిస్తాన్ నానా యాగీ చేస్తోంది. ఇప్పటికే సిందూర్‌తో పాకిస్తాన్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తోన్న ఇండియా, ఈసారి ఏం చేసినా ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా బాంబు పేల్చారు. ఇండియాతో పాకిస్తాన్ యుద్ధం చేయక తప్పదన్న వర్షన్ విన్పించాడు.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య యుద్ధ భయం నెలకొంది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసిఫ్ యుద్ధంపై క్లారిటీ ఇచ్చారు. భారతదేశం నుంచి పూర్తి స్థాయి యుద్ధం లేదంటే, ఏదైనా శత్రు వ్యూహాన్ని తాను తోసిపుచ్చలేనన్నాడు. పాకిస్తాన్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనన్నాడు. భారతదేశం విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జాగ్రత్త ఇంకొంచెం అవసరమన్నాడు.
పాక్ మంత్రి వ్యాఖ్యలు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యల తర్వాత రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం ఉపేంద్ర ద్వివేది ఆపరేషన్ సిందూర్‌ను 88 గంటల ట్రైలర్ మాత్రమేనని అభివర్ణించారు. అవసరమైతే భారత సైన్యం పొరుగు దేశాలను ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండేలా చేయగలదన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలు, బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో నేర్పించడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇప్పుడు పాక్ మంత్రి మాటలున్నాయన్న భావన కలుగుతోంది.
ఈ ఏడాది ఇప్పటికే భారత గడ్డపై రెండు పెద్ద దాడులు పాక్ ఆలోచనలను స్పష్టం చేస్తున్నాయి. పహల్గామ్ ఘటన, న్యూఢిల్లీలో జరిగిన కారు పేలుడుతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రతపై రెండు దేశాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. పాక్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఇటీవల తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
తాలిబన్ దాడులు, పాకిస్తాన్ వైమానిక ప్రతీకారాలు, రెండు వైపులా మరణాలు, ఈ మొత్తం పరిస్థితి పాక్‌కు ఇబ్బంది కలగిస్తున్నాయి. ఐతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌పై జరుగుతున్న దాడులకు భారతదేశం పరోక్ష మద్దతిస్తోందని తాజాగా ఆసిఫ్ ఖవాజా మరోసారి ఆరోపించడం, ఆ దేశ అజెండా ఏంటో అర్థమయ్యేలా చేస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం, పాకిస్తాన్‌పై ఇండియా కోసం ప్రత్యక్ష యుద్ధం చేస్తోందని పాక్ మంత్రి ఆరోపిస్తున్నాడు. తాలిబన్ నిర్ణయాలు భారత ప్రభావంతో తీసుకుంటున్నాయనే వాదనను విన్పించాడు. అయితే ఆసిఫ్ ఖవాజా వైఖరిపై తాలిబన్ ప్రభుత్వం మండిపడింది. పాక్ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ పాలకులు ఏ దేశం అంతర్గత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోదని, పాకిస్తాన్‌పై దాడులను ఎట్టి పరిస్థితుల్లో తాము ఆమోదించబోమని వారు స్పష్టం చేస్తున్నారు. తూర్పు సరిహద్దులో ఇండియా నుంచి-పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు వైపులా ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
ఎవరు ఎటువైపు నుంచి తమపై యుద్ధం చేస్తారో తెలియడం లేదని వాపోతోంది. పాక్ మంత్రి వ్యాఖ్యలు, తాలిబన్ రియాక్షన్, ఇండియా ఆర్మీ చీఫ్ ఎదురుదాడి అన్నీ కూడా సరిహద్దుల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న సందేశాన్నిస్తున్నాయన్న వర్షన్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్‌ను కట్టడి చేయడం రాని పాకిస్తాన్, ఇండియాపై యుద్ధం చేస్తోందట.. బుద్ధి చెప్తోందట.. హౌ పిటీ ఇటీజ్.



