Pakistan-India: పాకిస్తాన్ తప్పుడు సమాచార ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్

Pakistan-India: కాపీ కొట్టాలన్నా తెలివుండాలంటారు. ఎలా పడితే అలా కాపీ కొడితే దొరికిపోవడం తధ్యం. అందుకే కాపీ కొట్టేటప్పుడు కొంచెం వెనుకా, ముందు చూడాలంటారు. కానీ పాకిస్తాన్ సైన్యానికి మాత్రం కాపీ కొట్టడం కూడా చేతకాదని తాజాగా తేలిపోయింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత బలగాలు నిర్వహించినట్టుగా, తాము కూడా ఇండియాపై ఆపరేషన్ చేశామని చెప్పుకోవాలని చూసిన పాకిస్తాన్, ప్రపంచ వ్యాప్తంగా ఎర్రిపప్పా అయ్యింది.
ఆపరేషన్ సిందూర్ పై భారతదేశం నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్‌లను అనుకరించడానికి పాకిస్తాన్ చేసిన విఫల ప్రయత్నం ప్రపంచం ముందు పాకిస్తాన్‌ను జోకర్ చేసింది. పాకిస్తాన్ ప్రెస్ మీట్‌ను కవర్ చేయాలని ఆసక్తిగా చూసిన ప్రపంచ దేశాల మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టయ్యింది. ఈల్లేంద్ర బాబూ తుస్సమనిపించారని వారందరూ వాపోయారు. పాక్ తీరును మీడియా సంస్థలు గేలి చేశాయి.
గత కొన్ని రోజులుగా భారతదేశం న్యూఢిల్లీలో , ఆపరేషన్ సిందూర్ గూరించి జాయింట్ ప్రెస్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి, భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళానికి చెందిన సీనియర్ అధికారులు పాకిస్తాన్ భూభాగంలోకి భారత వైమానిక దళం చేసిన స్పష్టమైన దాడుల ఇమేజెస్, వీడియోలను షేర్ చేయడమే కాకుండా, ఆధారాలను అందిస్తూ సమచారాన్ని వివరించారు. పాకిస్తాన్ తప్పుడు సమాచార ప్రచారాన్ని తిప్పికొట్టారు.
ఇండియా ఆపరేషన్ ను హైలెట్ చేస్తూ, సాగించిన దూకుడును బలగాలకు నేతృత్వం వహించిన అధికారులు, మీడియా సమావేశంలో పాల్గొనడం, మొత్తం విషయాలను చెప్పడంతో వ్యవహారం రక్తికట్టింది. దాడి వివరాలను ఉన్నత అధికారులు వివరించగా, ప్రపంచం ఆసక్తిగా చూసింది. దీంతో తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్ సైతం ఇలాంటి సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చింది. రావల్పిండి సైనిక కేంద్ర కార్యాలయంలో ఇలాంటి మీడియా బ్రీఫింగ్‌లను నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నించింది.
పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సమావేశం ఏర్పాటు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. పాకిస్తాన్ ప్రెస్ కాన్ఫరెన్స్, పూర్తిగా ఇండియా నిర్వహించిన సమావేశంలా ఉంది. ఐతే పాకిస్తాన్ చెబుతున్నట్టుగా వారి వాదనకు మద్దతు ఇచ్చేలా, ఆకట్టుకునే ఇమేజెస్, విజువల్స్, ఇతర ఆధారాలు కూడా ఏమీ లేవని ప్రముఖ ఆస్ట్రేలియన్ టెలివిజన్ న్యూస్ ఛానల్ ఆపహాస్యం చేసింది.
లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన స్పష్టమైన ప్రకటనలు ఉన్మాదంతో ఉన్నాయని మీడియా విమర్శలు గుప్పించింది. భారత బలగాలకు నేతృత్వం వహించిన సమావేశాలు పోటీపడి నిర్వహించిన సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎగతాళి చేసే అనేక సోషల్ మీడియా పోస్ట్‌లను విదేశీ మీడియా కూడా ఎత్తి చూపించింది.
సిర్సా నుండి ఢిల్లీ వరకు భారతదేశంలోని లక్ష్యాలను తాము ఢీకొట్టామని పాకిస్తాన్ సైన్యం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరిస్తూ అందరూ ఫక్కున నవ్వారు. సమావేశం, భారత సైన్యం శైలికి పూర్తిగా కాపీగా ప్రకటన గుప్పించింది. కానీ ఒక్క ఆధారం కూడా లేదు. జీరో ప్రూఫ్. వీడియోలు లేవు. ఫుటేజ్ లేదు. ఏమీ లేవు. ఏమిటి, సర్కస్ యాక్ట్? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయ్.
ఇండియాలో సమావేశం నిర్వహించిన 4 గంటల తర్వాత ప్రెస్ కాన్పరెన్స్ నిర్వహించి కూడా తప్పుల తడకగా చెప్పడమేంటన్న విమర్శ రేగింది. భారతదేశంలో ఐదేళ్ల పిల్లోడు కూడా ఇంతకంటే మెరుగ్గా ప్రజంటేషన్ చేయగడని నెటిజన్లు క్యామెడీ చేశారు. అందుకే పాక్ పౌరులు ఎవరూ కూడా సైన్యం ప్రకటనను పట్టించుకోవడం లేదని లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఐతే ఇండియా మొదట్నుంచి తామేం చేశామో ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తూ వచ్చింది.
అంతేకాదు ఇండియాలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలకు సమాచారం అందించింది. అణ్వాయుధ వ్యవస్థలను న్యూట్రలైజ్ చేయడం, వీడియోలు, ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఒక బ్రీఫింగ్‌లో పాకిస్తాన్ భూభాగంలో భారతదేశం నిర్ణయాత్మక వైమానిక దాడుల వీడియోను ప్లే చేసి చూపించారు. ఇది శివ తాండవ్ స్తోత్రం శ్లోకంతో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఈ వీడియోను షేర్ చేసుకున్నారు.
అదేవిధంగా, ఆపరేషన్ సిందూర్ గురించి బ్రీఫింగ్ సందర్భంగా, ఎయిర్ మార్షల్ AK భారతి రామచరితమానస్‌లోని ఒక పద్యం గురించి ప్రస్తావించారు. నిన్న, శివ తాండవ స్తోత్రం. ఈరోజు, రామచరితమానస్ నుండి ఒక కోట్. శత్రువును హెచ్చరించడానికి ఎంత మంచి మార్గం అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. కానీ పాకిస్తాన్ ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో ఆ దేశ ప్రజలతోపాటు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.