ఆంధ్ర ప్రదేశ్
బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా పాక వెంకటసత్యనారాయణ

Paka Venkata Satyanarayana: బీజేపీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణకు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంకట సత్యనారాయణను రాజ్యసభకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు.
ఏపీలో కార్యకర్తల సేవలను బీజేపీ గుర్తించే పనిలో ఉందన్నారు. ప్రతీ అవకాశాన్ని కార్యకర్తలకే ఇచ్చేలా పార్టీ చేస్తున్న ప్రయత్నం చాలా అమోఘమని అన్నారు. పాక వెంకటసత్యనారాయణను రాజ్యసభకు పంపిస్తున్న అధిష్టానానికి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ధన్యవాదాలు తెలిపారు.