తెలంగాణ
Nirmal: రైతు ఆలోచన భలే.. బైకులతో వరి నూర్పిడి

Nirmal: ఈ వీడియోచూస్తే మిత్రులంతా సరదాగా బైక్ రేస్ పెట్టుకున్నారేమో అనిపిస్తోంది. కానీ, వాళ్లు వరి పంటను నూర్పిడి చేస్తున్నారు. ఈ సన్నివేశం నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రానికి చెందిన పోతన్న 20 గుంటల స్థలంలో వరి సాగు చేశారు. పంట కోతకు రావడంతో పొలాన్ని కోయించి కుప్పవేశారు.
తొలుత ట్రాక్టర్‌తో నూర్పిడి చేయించే ప్రయత్నం చేసినా చిన్న విస్తీర్ణం కావడంతో కుదరలేదు. దీంతో పోతన్న స్నేహితులు ముందుకొచ్చి తమ బైకులతో వరి నూర్పిడి చేశారు.



