జాతియం

IndiGo: 100కు పైగా ఇండిగో విమానాల రద్దు

IndiGo: దేశవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 100కు పైగా విమానాలను రద్దు చేసింది. ఒక్క శంషాబాద్‌ నుంచే 40 విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన వారిలో చాలా మంది రైళ్ల కోసం పరుగులు తీశారు. ముందస్తు సమాచారం లేకుండా కొచ్చిన్‌ విమానాన్ని రద్దు చేశారని అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

భద్రతాధికారులు జోక్యం చేసుకుని రీషెడ్యూల్‌ చేసిన సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని సముదాయించడంతో ప్రయాణికులు శాంతించారు. రానున్న 48 గంటల్లోనూ పలు విమాన సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిసింది. గురువారం కూడా శంషాబాద్‌ నుంచి 36 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. పైలట్ల విధుల నియంత్రణపై ఇటీవల డీజీసీఏ విధించిన నిబంధనలతోపాటు రాత్రి విమానాల ల్యాండింగ్‌ను తగ్గించడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని వివరించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button