తెలంగాణ
Hyderabad: జంట జలాశయాలకు పోటెత్తిన వరద

Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద పోటెత్తింది. అధికారులు హిమాయత్ సాగర్ 4గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3 వేలు, ఔట్‌ఫ్లో 4వేల క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ 10 గేట్లు ఎత్తినీటిని విడుదల చేశారు.
ఇన్‌ఫ్లో 4వేల 500, ఔట్‌ఫ్లో 7వేల క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. మంచిరేవుల-నార్సింగ్‌కి రాకపోకలు బంద్ అయ్యాయి.



