జాతియం
Online Gaming Bill: లోక్‌సభ ముందుకు ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

Online Gaming Bill: పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు వచ్చాయి. రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లుతో పాటు జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు, ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.
30 రోజులు జైల్లో ఉంటే పదవి రద్దయ్యేలా బిల్లు తెచ్చింది ప్రభుత్వం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును అమిత్ షా ప్రవేశపెట్టారు. బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అమిత్ షాపై బిల్లు పేపర్లను చింపి వేశారు.



