తెలంగాణ
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మరో వ్యక్తి బలి

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మరో వ్యక్తి బలయ్యాడు. బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. షరీఫ్‌ఉద్దీన్ అనే యువకుడు పని ముగించుకుని ఇంటికి వెళ్తూం వరదలో బైక్‌తో సహా కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతుడు ముషీరాబాద్‌కు చెందిన షరీఫ్ ఉద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. స్థానిక యువకులు షరీఫ్ ఉద్దీన్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతడు నీట మునిగి మృతి చెందాడు.



