ఆంధ్ర ప్రదేశ్
Kurnool: భారీ వర్షానికి పురి గుడిసెపై పడిన పాత గోడ.. తండ్రి కొడుకు మృతి

Kurnool: కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి పాత గోడ కూలి పక్కనే ఉన్న పురి గుడిసెపై పడింది. ప్రమాదంలో తండ్రి కొడుకు ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



