తెలంగాణ
సికింద్రాబాద్ బౌద్ధనగర్‌లో మేయర్ పర్యటన

Mayor Vijayalaxmi: నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్‌లో ఎంపీ అనిల్ కుమార్‌తో కలసి మేయర్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నాలా పూడిక తీత, విస్తరణ, డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
సికింద్రాబాద్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదమ్ సంతోష్ కుమార్, కార్పొరేటర్ శైలజ రిక్వెస్ట్‌తో స్థానిక నాలల పరిస్థితుల్ని పరిశీలించామన్నారు. నాలాల పూడికతీత, విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను సూచించారు.