Odisha: ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించిన పెద్దలు

Odisha: సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ‘ప్రేమ వివాహం’ చేసుకున్నందుకు ఓ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించిన ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని కంజామఝిరా గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతరు మరదలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆగ్రామంలో మరదలను పెళ్లి చేసుకోకూ దనే నిబంధన ఉండటంతో కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు వ్యతిరేకించారు.
అక్కడి సంప్రదాయాలు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా వారు ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ జంటను ఓ నాగలికి కాడెద్దులుగా కట్టారు. వారిని కర్రలతో కొడు తూ.. ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు.
అనంతరం వారిని గ్రామంలోని ఓ దేవాలయానికి తీసకువెళ్లి శుద్ధి కర్మలు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.