సినిమా

ఎన్టీఆర్ కుమారస్వామి కోసం సిద్ధం!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి పౌరాణిక పాత్రలో మెరవనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో కుమారస్వామి నేపథ్యంలో రూపొందనున్న భారీ చిత్రం కోసం తారక్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ పాత్రైనా, ఏ జానర్‌లోనైనా తనదైన ముద్ర వేసే ఈ నటుడు, పౌరాణిక పాత్రల్లో మరింత సమర్థవంతంగా రాణిస్తాడు. జై లవకుశ, యమదొంగ లాంటి చిత్రాల్లో తారక్ నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో కుమారస్వామి నేపథ్యంలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటి నుంచే తీవ్రంగా సిద్ధమవుతున్నారు.

ముగుగన్ పుస్తకంతో కనిపించిన తారక్, పాత్ర కోసం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ డెడికేషన్ చూస్తే, ఎన్టీఆర్ ఈ సినిమాతో మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ భారీ చిత్రం త్వరలోనే అధికారిక ప్రకటనతో అభిమానులను అలరించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button