NTR: ఎన్టీఆర్ 42వ జన్మదిన వేడుకలు.. అభిమానుల ఆరాటం, సోషల్ మీడియాలో హంగామా!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేశారు. సోషల్ మీడియాలో ‘హ్యాపీ బర్త్‌డే తారక్’ హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. భారీ కటౌట్స్, పూజలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా అభిమానుల ఆనందం అంబరాన్ని అంటింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నివాసం వద్ద భారీ కటౌట్స్, బ్యానర్లతో అభిమానులు సందడి చేశారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంతం కళకళలాడింది. ఈ సందర్బంగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎస్కేపి హైస్కూల్లో బోయ సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ శిబిరంలో 80 మందికి పైగా ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు. సురేష్ నాయుడు మాట్లాడుతూ, అభిమానుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
గౌరీశ్వర్ నాయుడు, సతీష్ కుమార్, ఉపేంద్ర నాయుడు, ఆనంద్, మధు, శ్రీధర్, పెద్ది తదితర అభిమానులు పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలను ఎన్టీఆర్ అభిమానుల తరఫున కొనసాగిస్తామని సురేష్ నాయుడు తెలిపారు.సోషల్ మీడియాలో ‘హ్యాపీ బర్త్‌డే తారక్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.