తెలంగాణ
Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

Notices to MLAs: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. న్యాయ సలహా అనంతరం స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో న్యాయ నిపుణులతో చర్చించి నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరికీ స్పీకర్ నోటీసులు ఇవ్వనున్నారు.



