క్రీడలు
Nitish Reddy: కెరీర్‌లో తొలి సెంచరీ.. అరుదైన ఘనత సాధించిన నితీశ్ రెడ్డి..
Nitish Kumar Reddy: మెల్‌బోర్న్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ అదరగొట్టాడు. 171 బంతుల్లో తొలి శతకాన్ని సాధించాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన నితీష్.. జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు దానిని అధిగమించాడు నితీష్‌కుమార్ రెడ్డి.