జాతియం
Nitish Kumar: బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Nitish Kumar: బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ వేడుకలో నీతీశ్‌తో పాటు కొత్త మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకులు హాజరయ్యారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే జరిగిన ఎన్డీయే శాసనసభ్యుల సమావేశంలో నీతీశ్ కుమార్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



