జాతియం
బిహార్ సీఎం పదవికి నితిష్ కుమార్ రాజీనామా

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్యసభకు వెళ్తున్నానని నితీష్ కుమార్ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. నితీష్ రాజీనామాపై సొంత పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. నితీష్ సీఎంగానే ఉండాలని జేడీయూ కోరుతోంది. రెండు దశాబ్దాలకు పైగా బిహార్‌లో చక్రం తిప్పారు నితీశ్. సుదీర్ఘకాలం సీఎం పీఠంలో కూర్చున్నారు. నితీశ్ రాజీనామాతో ఇక బిహార్ సీఎం పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లనుంది.



