కన్నడ బ్యూటీతో చిరు మాస్ స్టెప్పులు!

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో కన్నడ నటితో స్పెషల్ సాంగ్‌లో చిందులేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ పాట వింటేజ్ చిరును గుర్తుచేస్తుందట. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యువ దర్శకుడు వసిష్ఠ మల్లిడి రూపొందిస్తున్న ఈ సినిమాను UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పుడు అందరి దృష్టి సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌పై ఉంది. ఈ పాట కోసం భీమ్స్ సిసిరోలియో ఓ ఎనర్జిటిక్ మాస్ నంబర్ సిద్ధం చేశారు.
ఈ సాంగ్‌లో చిరంజీవితో పాటు కన్నడ నటి నిశ్విక నాయుడు స్టెప్పులేయనుంది. గతంలో ప్రభుదేవాతో ‘కరటక దమనక’లో డాన్స్‌తో అలరించిన నిశ్విక, ఇప్పుడు చిరుతో చిందులేస్తూ అభిమానులను ఆకట్టుకోనుంది. ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ సాంగ్స్‌కు వచ్చిన క్రేజ్‌ను ఈ పాట మళ్లీ తెరపై చూపనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.