సినిమా

పుష్ప 2′ తొక్కిసలాట ఘ‌ట‌న‌పై NHRC సీరియ‌స్‌.. సీఎస్‌కు నోటీసులు

పుష్ప-2 ప్రివ్యూ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్‌ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలూ జారీ చేసింది.

పుష్ప 2 చిత్ర ప్రివ్యూ షో సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో విచారణ జరిగింది. ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ సీఎస్‌కు నోటీసులు పంపించింది.

అలాగే చనిపోయిన బాధితులకు 5 లక్షల రూపాయాలు చెల్లించాలని బాధ్యులకు, అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్‌కి చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో 146 రోజులు పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు, కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button