ఆంధ్ర ప్రదేశ్
రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి

Train Accident: రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలానికి చెందిన సింహాచలం, భవానిగా గుర్తించారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు.



