Vikarabad: నవ వధువు ఆత్మహత్య

Vikarabad: వంట సరిగ్గా చేయట్లేదని భార్యను పుట్టింట్లో వదిలేశాడు ఓ భర్త. నాకు నువ్వు అక్కర్లేదు అక్కడే చావు అంటూ దూషించడంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం గడ్డమీది గంగారంలో చోటుచేసుకుంది. పరిగి మండలం మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తితో శిరీషకు వివాహం జరిగింది. వంట బాగా చేయడం లేదంటూ, తనకన్నా తక్కువ చదువుకున్నావంటూ శివలింగం ఆమెను నిత్యం వేధించేవాడు.
భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య తిరగబడటంతో ఆగ్రహానికి గురైన శివలింగం భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. మరుసటి రోజు ఫోన్ చేయగా నువ్వు అక్కర్లేదు అక్కడే చావు అని దూషించాడు శివలింగం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి చావుకు అల్లుడే కారణమని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని శిరీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.



