తెలంగాణ
హైదరాబాద్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ 2026 వేడుకల సందర్భంగా చార్మినార్, సచివాలయం, కెబిఆర్ పార్క్ వంటి ప్రదేశాలలో కేక్ కటింగ్ చేసి, నగర ప్రజలకు, పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సురక్షితమైన నగరాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని సీపీ సజ్జనార్ తెలిపారు.



