New Ration Cards: సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ..!

త్వరలోనే ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. అర్హులకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితిని పరిశీలించారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పుచేర్పులు చేయనున్నట్లు సమాచారం.
ఆదాయ పరిమితి కొంత పెంచాలని ప్రతిపాదించనున్నట్లు టాక్ నడుస్తోంది. వారంలోపే రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈలోగానే తాజా మార్గదర్శకాలను ఖరారుచేసి సమర్పించనున్నారు. పౌరసరఫరాలశాఖ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
పాత మార్గదర్శకాల్లో ఆదాయ పరిమితి.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేలు, పట్టణాలు, నగరాల్లో 2 లక్షలుగా ఉంది. ఈ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని 10-20 వేల వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. భూమి విషయానికి వస్తే.. 3.5 ఎకరాల్లో పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్ట భూమి అర్హతలుగా గతంలో ఉన్నాయి.