Nani: ది ప్యారడైజ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్

Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘ది ప్యారడైజ్’ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో నాని రెండు జడలతో రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి, సినిమాపై ఆసక్తిని పెంచింది. విజువల్స్, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉండటంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా మూవీ టీం సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నాని వైల్డ్ లుక్‌లో కనిపించాడు. ‘ఇంకా 365 రోజులు మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.