సినిమా

Shree Hanuman Chalisa: యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన ‘హనుమాన్ చాలీసా’

Shree Hanuman Chalisa: రీసెంట్‌గా వచ్చిన రామ్ చరణ్ చికిరి పాట యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందని రోజుకో వార్త వింటున్నాము. కానీ ఓ భారతీయ వీడియో యూట్యూబ్‌లో 500 కోట్లకంటే ఎక్కువ వ్యూస్ సాధించిందని మీకు తెలుసా..? ఇది ఒక భారతీయ వీడియోకి ప్రపంచ రికార్డు వరల్డ్ టాప్ 10 లోకి వచ్చిన ఏకైక భారతీయ వీడియో.

ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇదేమీ సినిమా పాటో, డాన్స్ వీడియోనో కాదు. వీక్షకులను భక్తిసాగరంలో ముంచేసిన డివోషనల్ వీడియో. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి దరిదాపుల్లో కూడా వేరే ఈ ఎటువంటి వీడియో కూడా లేదు. మరి ఇంతకీ ఆ వీడియో ఏంటీ.? ప్రేక్షకులను భక్తి సాగరంలో ముంచేత్తుతున్న ఆ వీడియో విశేషాలెంటి..?

గతంలో సోషల్ మీడియాలో హిందూ సమాజ వీడియోలకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. యువత కూడా అంత ఆసక్తిగా చూసే పరిస్థితి ఉండదు. కానీ గత 5 ఏళ్ళుగా పరిస్థితి వేగంగా మారింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతోన్న వీడియోలకు మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ఓ వీడియోను ఏకంగా 500 కోట్ల మంది వీక్షించారు. సాధారణంగా ఫేమస్ మ్యూజిక్ స్టార్ లు, సినిమా వాళ్లకు ఈ తరహాలో వ్యూస్ వస్తూ ఉంటాయి. యూత్ ను ఆకట్టుకునే ఇంగ్లీష్ వీడియోలు ఈ రేంజ్ లో ఫేమస్ అవుతూ ఉంటాయి.

కానీ హనుమాన్ చాలీసా వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టీ – సిరీస్ వ్యవస్థాపకుడు దివంగత గుల్షన్ కుమార్ నటించగా హరిహరన్ పాడిన శ్రీ హనుమాన్ చాలీసా, 14 ఏళ్ళ క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో ఇండియాలో ఉన్న అన్ని వీడియోలను డామినేట్ చేసింది.

హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. చిరంజీవి అయిన మారుతీ నేటికీ భూమి తిరుగుతున్నాడని చాలా మంది నమ్మకం. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం, ఆనందం, సంపద, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఇక హనుమాన్ చాలీసా విశిష్టత గురించి తెలిసిందే. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు.

అయితే తాజాగా హనుమాన్ చాలీసాను కేవలం భారత్‌లోనే కాదు. ప్రపంచం మొత్తం వీక్షించింది. సంగీత సంస్థ టి-సిరీస్‌కి చెందిన శ్రీ హనుమాన్ చాలీసా యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఏకంగా 500 కోట్లకు పైగా వీక్షణలు పొందింది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో 5 బిలియన్లకు పైగా వీక్షణలు పొందిన ఇండియన్ వీడియోగా నిలిచింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 14 సంవత్సరాల తర్వాత.. ఈ భక్తి వీడియో అన్ని బాలీవుడ్ ట్రాక్‌లు, పంజాబీ హిట్‌లు, వైరల్ చార్ట్‌బస్టర్‌లను దాటేసింది.

మే 10, 2011న విడుదలైన ఈ వీడియోలో దివంగత గుల్షన్ కుమార్ నటించారు. హరిహరన్ గానం, లలిత్ సేన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ వీడియో 5,009,382,302పైగా వీక్షణలతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. గత 14 ఏళ్లుగా ఒక భక్తిగీతంగా అందరి ఇళ్లల్లో వినిపిస్తోంది. ఈ పాట తన ప్రజాదరణను ఏ మాత్రం కోల్పోకుండా, మరింతగా పెంచుకుంటూ పోతుంది. ఈ రికార్డుకి దగ్గరగా మరే భారతీయ వీడియో కూడా లేకపోవడం హనుమాన్ చాలీసాకు ఉన్న విశిష్టతను స్పష్టం చేస్తోంది. 500 కోట్లకు పైగా వీక్షణలు అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం.

ఈ వీడియో సాధించిన ఘనత పై టి-సిరీస్ స్పందిస్తూ మీ అచంచలమైన ప్రేమ, భక్తి, బలం, సమర్పణతో, హనుమాన్ చాలీసా 5 బిలియన్ల వీక్షణలను దాటిన భారతదేశంలోని ఏకైక వీడియోగా మారింది. ధ్వనించే ప్రపంచంలో విశ్వాసం ఎల్లప్పుడూ తన మార్గాన్ని కనుగొంటుందని శాశ్వతంగా గుర్తు చేస్తుందంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో దరిదాపుల్లోకి కూడా మరే ఇతర భారతీయ వీడియో చేరలేదు. హనుమాన్ చాలీసా తరువాతి స్థానంలో పంజాబీ ట్రాక్ లెహెంగా 1.8 బిలియన్ వ్యూస్‌ను కలిగి ఉంది.

ఇక హనుమాన్ చాలీసా అనేది 16వ శతాబ్దంలో మహాకవి గోస్వామి తులసీదాస్ రచించిన 40 శ్లోకాల స్తోత్రం. ఇది భగవాన్ హనుమంతుడి శక్తిని, భక్తిని, గుణగణాలను కీర్తిస్తుంది. శాంతి, బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసం కోసం భక్తులు ప్రతిరోజూ జపించే గీతంగా ఇది మారింది. ఎలాంటి కష్ట సమయాల్లోనైనా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా ధైర్యం లభిస్తుందని, ఆపదలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ముఖ్యంగా భారత్ వాసీలకు హనుమాన్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లదు. హనుమంతుడు లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదేమో హనుమంతుడు ఎంత ఇష్టమో హనుమాన్ చాలీసా అన్నా కూడా అంతే భక్తి. ప్రతి ఒక్కరికీ ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని కలిగించేది హనుమాన్ చాలీసా.

హనుమాన్ చాలీసా ఈ భారీ రికార్డును సృష్టించడానికి అనేక కారణాలున్నాయి. ఇది కేవలం ఒక పాట కాదు, కోట్లాది మంది భక్తులకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి. హిందీలో ఉన్నప్పటికీ, దానిలోని భక్తి భావం, శక్తివంతమైన పదాలు భాషా బేధాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాయి. T-సిరీస్ విడుదల చేసిన వెర్షన్ సంగీతం, గానం అద్భుతంగా కుదిరాయి. ఇది భక్తులకు మరింత ఆహ్లాదకరంగా మారింది. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా అందుబాటులోకి రావడం. తరం తరం నుంచి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం, దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడం వల్ల కొత్త తరానికి కూడా చేరువైంది.

హనుమాన్ చాలీసా సాధించిన ఈ 5 బిలియన్ వ్యూస్ రికార్డు, డిజిటల్ యుగంలో ఆధ్యాత్మిక కంటెంట్‌కు ఉన్న అపారమైన శక్తిని, భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక పాట విజయం కాదు, ఒక నమ్మకం, ఒక శక్తి, ఒక చరిత్ర విజయం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button