అంతర్జాతీయం
Nepal: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత

Nepal: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్‌పై వారం క్రితం నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా యువత ఆందోళనబాట పట్టింది.
నిన్న ఖాట్మండులో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. దీనికి బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రాజీనామా చేశారు. ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది నేపాల్ ప్రభుత్వం.



