ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. కలెక్టర్కు రాజీనామా పత్రం ఇస్తానని మేయర్ స్రవంతి తెలిపారు. మేయర్గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.
మేయర్ చేసిన జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని స్రవంతి అన్నారు. తనకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భయపెడుతూ కేసులు పెడుతున్నారని స్రవంతి ఆరోపించారు. మహిళా కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరిస్తున్నారని మేయర్ స్రవంతి విమర్శించారు.



