చదువు

నీట్ యూజీ కొత్త సిలబస్‌ విడుదల.. PDF డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

NEET UG 2025 Syllabus Released by NMC : దేశవ్యాప్తంగా బ్యాచిలర్‌ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్‌ యూజీ) సిలబస్‌ 2025ను నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) తాజాగా విడుదల చేసింది. నీట్ యూజీ-2025 నూతన సిలబస్‌కు సంబంధించి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోని అంశాలను యూనిట్ల వారీగా వివరాలను ప్రకటించింది. ఇక NEET UG 2025 ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది (2025) మే నెలలో జరిగే అవకాశముంది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. విద్యార్థులు సిలబస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nmc.org.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు 2025-26 విద్యాసంవత్సరానికి నీట్ యూజీ (NEET UG) పరీక్షల ప్రిపరేషన్ కోసం ఈ కొత్త సిలబస్ ను పరిశీలనలోకి తీసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది.

NEET UG సిలబస్‌ PDF

త్వరలో NEET యూజీ పరీక్ష విధానంపై నిర్ణయం

మెడికల్‌ కోర్సుల ప్రవేశ పరీక్ష నీట్- యూజీ (NEET UG 2025)ని పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించాలా లేదా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలా అనే దానిపై కేంద్ర విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చిస్తోందని.. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం (డిసెంబర్‌ 17) పేర్కొన్నారు. జేపీ నడ్డా నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖతో విద్యాశాఖ రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు విద్యాశాఖ మంత్రి ప్రధాన్ తెలిపారు. త్వరలో ఈ అంశంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.

NEET PG Exam 2025 : వచ్చే ఏడాది జూన్‌ 15న నీట్‌ పీజీ పరీక్ష.. తేదీ ఖరారు చేసిన NMC

NEET PG 2025 Exam Date : నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ వచ్చేసింది. ఈ పరీక్షను వచ్చే ఏడాది (2025) జూన్ 15వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. అలాగే.. National Eligibility Cum Entrance Test NEET PG పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు జులై 31, 2025 నాటికి ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 52,000 మెడికల్‌ పీజీ సీట్ల కోసం సుమారు 2 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడుతున్నారు. అలాగే.. ర్యాగింగ్ నివారణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని.. 2021లో జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జాతీయ వైద్య మండలి.. అన్నీ మెడికల్‌ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button