జాతియం
Bihar Results: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే జోరు.. 191 స్థానాల్లో ఆధిక్యం

Bihar Results: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తాజా లెక్కింపుల ప్రకారం ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ఏకంగా 191 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.



