సినిమా

Nayanthara: చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాకి నయనతార షాకింగ్ రెమ్యూనరేషన్‌!

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి సంచలన వార్త. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించేందుకు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం.

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నయనతారను ఎంచుకునేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆమె ఏకంగా 18 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. నయనతారకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో భారీ మార్కెట్ ఉండటంతో, ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రెమ్యూనరేషన్‌లో స్వల్ప తేడా ఉన్నా, నయనతారతోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని సాహూ గారపాటి షైన్ స్క్రీన్స్, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండగా, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button