సినిమా

నవీన్ పొలిశెట్టి సంక్రాంతి సందడి..!

తెలుగు సినిమా అభిమానులకు గుడ్ న్యూస్! నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

టాలీవుడ్ స్టార్ నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జోడీగా రూపొందుతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ కామెడీ ఎంటర్టైనర్‌పై ఆరంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారి ఈ చిత్రాన్ని సరదా సరదాగా తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి పండుగ సీజన్‌లో, జనవరి 14, 2026న విడుదల చేయనున్నట్లు ఓ ఫన్‌ఫుల్ ప్రోమోతో అనౌన్స్ చేశారు. సంక్రాంతికి పెద్ద సినిమాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ, మేకర్స్ కాన్ఫిడెన్స్‌తో ఈ డేట్‌ను లాక్ చేశారు.

నవీన్ ట్రేడ్‌మార్క్ హాస్యం, మీనాక్షి గ్లామర్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అదనపు ఆకర్షణ. యువరాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button