ఆంధ్ర ప్రదేశ్
Narayana: వడ్డమాను గ్రామం రైతులతో మంత్రి నారాయణ సమావేశం

Narayana: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రైతుల అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు రైతులు. రైతులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు.
ఏడు గ్రామాల్లో 16.666 వేల పైచిలుకు భూమి అవసరం ఉందని మంత్రి తెలిపారు. 2014 -19 లో రాజధాని రైతుల సలహాలతో పాలసీ నిర్ణయించామని రైతులతో మాట్లాడి వారి నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం మారటం వలన గత ప్రభుత్వం కేసులు వల్ల జాప్యం జరిగిందని తమ పరిధిలో చేయగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.



