ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబసభ్యులను రాష్ట్ర విద్య ఐటీశాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరామర్శించారు.
మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి భానుచందర్ నాయుడు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నారా లోకేష్, ఫరూక్ నివాళులర్పించారు. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీద మస్తాన్ రావు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లోకేష్ వెంట వచ్చి దివంగత సుబ్బానాయుడు కుటుంబ సభ్యుల పరామర్శించారు.



