ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: తిట్టుకుందాం, కొట్టుకుందాం.. కానీ విడాకులు అవుటాఫ్ క్వశ్చన్

Nara Lokesh: అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కలిసి పనిచేయాలని సూచించారు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని అలగడం మంచిది కాదని నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం కానీ విడాకులు అవుటాఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు.
పార్టీలో తాను నిరంతరం పోరాడుతుంటానని అన్నారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని వివరించారు. తప్పు అనిపిస్తే ఆఖరికి నన్నయినా నిలదీయొచ్చన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని లోకేశ్ ఉద్ఘాటించారు.